Namaste NRI

ఈ సినిమా పెద్ద హిట్‌ కావడం ఖాయం: దిల్‌రాజు

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా రూపొందిన చిత్రం లవ్‌ మీ. ఇఫ్‌ యు డేర్‌ అనేది ఉపశీర్షిక. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అగ్రనిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ   ఇంతవరకు దర్శకులను పరిచయం చేసిన నేను, తొలిసారి నిర్మాతను పరిచయం చేస్తున్నాను. నాగ మల్లిడి మంచి అభిరుచిగల నిర్మాతగా ఎదుగుతాడు. ట్రైలర్‌ చూస్తే టీం కష్టం కనిపిస్తుంది. ఇది న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్‌ కావడం ఖాయం అని నమ్మకం వ్యక్తంచేశారు.   

దర్శకుడు మాట్లాడుతూ సీతమ్మ, సతీదేవి చనిపోయి దేవతలు అయితే, దివ్యవతి చనిపోయి దెయ్యం ఎలా అయ్యింది? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. ఇందులో ఆశిష్‌ పాత్ర పేరు అర్జున్‌. ఆ పాత్రలో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్ధంకంటే ప్రేమించడానికి ఎక్కువ గట్స్‌ కావాలి. అలాంటి దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్‌ ఉండాలి. ఆ పాత్రను ఆశిష్‌ ఎంతో ఇష్టంగా పోషించాడు. గంగాదేవి లాంటి పవిత్రమైన పాత్రను ఇందులో వైష్ణవి చైతన్య పోషించింది అని తెలిపారు. ఇంకా చిత్రయూనిట్‌ అందరూ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events