సాయిరామ్‌శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వెయ్ దరువెయ్. నవీన్ రెడ్డి దర్శకత్వం. దేవరాజ్ పోతూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్‌టికెట్‌ను పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ నేటి రాజకీయాల తీరుతెన్నులను విమర్శిస్తూ సమాజం లో చైతన్యం కలిగించే కథాంశమిది. చక్కటి సందేశంతో ఈ సినిమా తీశారు అన్నారు. తన కెరీర్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని, కమర్షియల్ అంశాలతో పాటు ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించే అంశాలుంటాయని హీరో సాయిరామ్‌శంకర్ తెలిపారు. 35 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, మూడువందలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
