Namaste NRI

ఆ సంఘటనకూ ఈ కథకూ సంబంధం ఉండదు

కంఠమనేని శివ, క్యాథలిన్‌ గౌడ్‌ జంటగా రూపొందిన చిత్రం మధురపూడి గ్రామం అనే నేను. మల్లి దర్శకుడు. కేఎస్‌ శంకరరావు, ఆర్‌.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించారు. దర్శకుడు మల్లి మీడియాతో మాట్లాడారు. ఓ ఊరు తన కథను తానే చెప్పుకుంటుంది. అదే ఈ సినిమా. విభిన్నమైన కథనంతో కూడిన సినిమాఇది. ఓ వ్యక్తి తలను పట్టుకొని పోలీస్టేషన్‌కి వెళ్లాడని చిన్నప్పుడు విన్నాను. ఆ విజువల్‌ నాకెప్పుడూ గుర్తుకువస్తూ వుంటుంది. దాన్ని అల్లుకొని ఈ కథ రాశాను. అయితే,  ఆ సంఘటనకూ ఈ కథకూ సంబంధం ఉండదు. ఇందులో పాలిటిక్స్‌, స్నేహం, యాక్షన్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా అవుతుంది అని చెప్పాడు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress