పాయల్ రాజ్‌పుత్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం వెంకటలచ్చిమి. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి ముని దర్శకత్వం వహిస్తున్నారు. రాజా, ఎస్ఎస్ చౌదరి నిర్మాతలు.ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని పేర్కొన్నారు. ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమా తర్వాత తనను ప్రేక్షకులు వెంకటలచ్చిమి అనే పేరుతో పిలుస్తారని, అంత బలమైన భావోద్వేగాలుంటాయని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బడిశా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముని.