రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారుతినగర్ సుబ్రమణ్యం. అంకిత్, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాత లు. ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరి స్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన మారుతినగర్ సుబ్రమణ్యం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నా సినిమా వచ్చి మూడేళ్లయింది. ఇక నుంచి ఎక్కువ సినిమాలు చేస్తాను. పుష్ప-2 అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నది. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఇది మాత్రం ఫిక్స్ అన్నారు.
నాకు సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను. తబితాగారు చాలా కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉండి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. రావు రమేష్ గారు నా మనసుకు నచ్చిన ఆర్టిస్టు.బద్రినాథ్ సినిమా టైంలోనే మీరు ఇండస్ట్రీని ఏలుతారు సర్ అని చెప్పా. ఈ మధ్య చిన్న సినిమాలకు ఆడియెన్స్ మంచి ఆదరణ కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగాలని కోరుకుంటున్నాఅన్నారు.
ఈ సినిమా చూసి బాగా నవ్వుకున్నానని, సినిమాల్లో బాగా పర్‌ఫార్మ్ చేసే వాళ్లను తాను పెద్ద హీరోగా చూస్తానని, తన దృష్టిలో రావు రమేష్‌గారు పెద్ద హీరోనే అని సుకుమార్ చెప్పారు. చిత్ర సమర్పకురాలు తబిత మాట్లాడు తూ ఈ సినిమా చూసినప్పుడు చక్కటి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో గొప్పగా అనిపించింది. ఇలాంటి మంచి సినిమా ప్రేక్షకులందరికి రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో సమర్పకురాలిగా ఉండటానికి ముందుకొచ్చా అని చెప్పింది. ఈ నెల 23న విడుదల కానున్నది.