భారత్, పాకిస్థాన్‌లు రెండూ దేశాలు తమకు ముఖ్యమేనని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఎఫ్`16 యుద్ధ విమానాలకు అవసరమైన కీలక పరికరాలకు పాక్‌కు అమెరికా సరఫరా చేయడంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం స్పందించింది. మేం భారత్, పాకిస్థాన్ సంబంధాలను ఒకదానిని దృష్టిలో పెట్టుకొని మరొకదానిని చూడం. వేర్వేరు అంశాల ఆధారంగా మాకు రెండు వేటికమే ముఖ్యమైన భాగస్వాములు. ఈ రెండు దేశాలు పరస్పరం నిర్మాణాత్మక సంబంధాలు పెంపొందించుకొనేలా చేయగలిగినంత చేస్తామనే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకొంటున్నాను అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అఫ్గాన్ ప్రజలకు మద్దతు అంశంపై నిత్యం పాకిస్థాన్‌తో చర్చిస్తాం. అఫ్గాన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, దయనీ పరిస్థితులను మెరుగుపర్చడం ఇచ్చిన హామీలు తాలిబన్లు నిలబెట్టుకొంటున్నారా అనే అంశాలను పరిశీలించడం కోసం పాక్‌తో మాట్లాడతాం అని తెలిపారు.














