
అమెరికాలోని తెలుగు సమాజానికి తానా తదితర సంస్థల ద్వారా సుదీర్ఘకాలంగా సాహితీ సేవలందిస్తున్న తోటకూర ప్రసాద్‌ను 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. ఈ నెల 16, 17 తేదీల్లో హ్యూస్టన్ నగరంలో వంగూరి ఫౌండేషన్, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి సాహిత్యాభిమానులు హాజరయ్యారు. సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు తోటకూర ప్రసాద్‌ను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సిలికాన్ ఆంధ్ర సీఈఓ రాజు చామర్తి, ప్రొఫెసర్ కాత్యాయని విద్మ హే, తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
















