
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా దేశభక్తి, ఐకమత్యాలను చాటుకునేందు కు అమెరికా జెండాలని పట్టుకుని నినాదాలు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల ప్రతిష్ఠాత్మక అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి అరెస్టయిన వారిని గుర్తు తెచ్చే బ్యానర్లను కూడా పట్టుకున్నారు.
