Namaste NRI

టైగర్‌ నాగేశ్వరరావు అనుపమ ఖేర్‌  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల

స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా అదే పేరుతోనే ఓ చిత్రం తెరకుక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రవితేజ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. ఇదివరకెన్నడూ చేయని పాత్రలో ఆయన కనిపిస్తారు. గెటప్‌, సంభాషణలు పలికే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్‌ని ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.   అనుపమ్‌ ఖేర్‌ సినిమాకి ప్రధానబలం. మేం నిర్మించిన ది కశ్మీర్‌ ఫైల్‌స సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరోసారి ఈ చిత్రంలో ఆయన నటిస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం రూ.7 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దాం. తెలుగుతో పాటు, తమిళం,  కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాని రూపొందిస్తున్నామని నిర్మాణ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. తేజ్‌ నారాయణ అగర్వాల్‌ సమర్పకులు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events