Skip to main content

Namaste NRI

టిల్లు స్క్వేర్ రాధికా సాంగ్ పిచ్చెక్కించేస్తోంది

హీరో సిద్ధు జొన్నలగడ్డ  నటిస్తున్న చిత్రం టిల్లు స్కేర్‌. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక.   మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రాధిక అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు రామ్‌ మిరియాల స్వయంగా ఆలపించారు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచు నువ్వు. మీరందరూ కూడా రాధికా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ స్టూడెంట్స్‌. టిల్లు గాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది అంటూ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌తో సిద్ధు చెప్పిన డైలాగ్స్‌ నవ్వుల్ని పంచాయి. రాధికా రాధికా..ముందుకా వెనకకా..కాటుక కళ్లతోని కాటేశావే నువ్వు. సూటిగా చూసి దిల్లు టైటే చేశావే అంటూ పాట ఆద్యంతం హుషారుగా సాగింది. తొలిభాగం కంటే రెండింతల వినోదంతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News