అమరదీప్ చౌదరి, సుప్రీతా నాయుడు జంటగా రూపొందుతోన్న లవ్ ఎంటైర్టెనర్ చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి. మాల్యాద్రిరెడ్డి దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మేకర్స్ విడుదల చేశారు. హీరోహీరోయిన్లతోపాటు రాశి, వినోద్‌కమార్, సురేఖవాణి, రాజారవీంద్ర లాంటి పాపులర్ నటీనటులు తోడవ్వడంతో సినిమాపై క్రేజ్ పెరిగిందని, షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల తెలిపారు.

ఈ సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు అమర్‌దీప్, సుప్రీతా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సురేఖవాణి కూడా మట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, డీవోపీ: జి.వి.అజయ్‌కమార్, సంగీతం: కె.వి.జె.దాస్, సమర్పణ: మహర్షి కూండ్ల, నిర్మాణం: ఎం.3 మీడియా.
