అమెరికా లోని నెబ్రాస్కా రాష్ట్రంలో గత వారం రోజులుగా టోర్నడోల ప్రభావం విపరీతంగా ఉంటోంది. సుడి గాలులు అనేక ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. నెబ్రాస్కాకు ఉత్తరాన సుడిగాలి దుమారానికి వాహనాల రాక పోకలు స్తంభించాయి. ఓ ట్రక్కు హైవే మధ్యలో బోల్తాపడింది. 70 కి పైగా సుడిగాలులు నమోదు కాగా, వాటిలో ఎక్కువ భాగం నెబ్రాస్కా లోని రవాణా కేంద్రమైన ఒమాహా చుట్టూ ఉన్నాయి, దాదాపు 11000 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తెగిపోయాయి.