భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ఓ మంచి వ్యక్తి అని, ఆయనలాంటి తండ్రి ఉండాలని అందరూ కోరుకుంటారని వ్యాఖ్యానించారు. టోక్యోలో వ్యాపారవేత్తలతో జరిగిన డిన్నర్ పార్టీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. మా మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆయన లాంటి తండ్రి ఉండాలని చాలామంది కోరుకుంటారు. అయితే ఆయన కఠినమైన వ్యక్తి. బలమైన నేత అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ ప్రస్తావించారు. భారత్‌తో అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, పాకిస్థాన్-భారత్ మధ్య మొదలైన యుద్ధానికి వాణిజ్యంతో బ్రేక్ వేసినట్లు ట్రంప్ తెలిపారు.
















