గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడు మంది పోర్చుగీస్, ఓ కెనడా దేశస్థుడు ఉన్నారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందినట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.


అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి కె. రామ్మోహన్ నాయడు హుటాహుటిన అహ్మదాబాద్‌కు పయనమయ్యారు.
