టాలీవుడ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో తుదిశ్వాస విడిచారు. గత రెండేళ్ల కిందట ఆమె క్యాన్సర్ బారినపడ్డారు. చికిత్సకు ఆమె శరీరం సహకరించింది. ఆ తర్వాత చికిత్సకు స్పందించలేదు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక అపర్ణ ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్ మూవీతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పోష్ పోరీస్ పేరుతో వెబ్ సిరీస్‌ను సైతం తెరకెక్కించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రాకముందే ఆమె వెబ్ సిరీస్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. రెండేళ్ల కిందట పెళ్లికూతురు మూవీని తెరకెక్కించారు. ఆమె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు దర్శకత్వంలో మెళకువలను నేర్పించారు. ఆమె మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.