తెలుగు ఇండస్ట్రీ లో మరో విషాదం. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే వాసు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు దర్శకుడు ఈయనే. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా కే వాసుకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ చందర్ హీరోగా వచ్చిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం సినిమాతో కే వాసు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత చిరంజీవితో అల్లుళ్లు వస్తున్నారు సినిమా తెరకెక్కించారు. సుమన్ తో అమెరికా అల్లుడు, శ్రీకాంత్ ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి లాంటి సినిమాలను కే వాసు తెరకెక్కించారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


