Namaste NRI

విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో నందమూరి వసుంధర, తేజస్వినితో పాటు పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. కేబినెట్‌ కార్యదర్శి స్వీట్‌ మెగ్చీ వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సేవలను ఆయన కొనియాడారు. ప్రభుత్వ ప్రీమియర్‌ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాన్ని అందించనున్నట్లు తెలిపారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించి నందమూరి వసుంధరకు అక్కడి ప్రభుత్వ ముఖ్య అధికారి లీ తర్లామిస్‌ పార్లమెంటు తరపున సేవ గుర్తింపు అవార్డును అందించారు. కార్యక్రమంలో అధికార పార్టీ ప్రతినిధులు, ఎంపీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events