కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ మేరకు ట్రంప్ సూచనను ట్రూడో ఘాటుగా తిరస్కరించారు. యూఎస్‌లో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇది అసాధ్యమని ఉద్ఘాటించారు. కెనడా యునైటెడ్ స్టేట్స్‌లో భాగమయ్యే అవకాశమే లేదు. అమెరికా, కెనడా రెండు దేశాల్లోని ప్రజలు, కార్మికులు వాణిజ్యం, సెక్యూరిటీ భాగస్వామ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారు అని ట్రూడో తెలిపారు.