శ్రీకమల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఉషాపరిణయం. విజయభాస్కర్ దర్శకత్వం. తాన్వీ ఆకాంక్ష అనే తెలుగమ్మాయి ఇందులో కథానాయిక. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రేమకు సరైన నిర్వచనం చెప్పే సినిమా ఇది. ప్రేమికులకు ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది. అన్ని ఎమోషన్సూ ఇందులో ఉంటాయి. సాంకేతి కంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు ధృవన్ విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు. నా కుమార్తె శ్యామల హీరోహీరోయిన్లకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయడమేకాక, ప్రొడక్షన్ విషయం ఎంతో హెల్ప్ చేసింది. ఇక కమల్ ఇందులోని హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు అని చెప్పారు. కె.విజయ భాస్కర్. హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం కూడా మాట్లాడారు. అలీ, వెన్నెలకిశోర్, సూర్య, రవి, శివతేజ, శివాజీరాజా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముత్యాల.