అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎదురుగాలి వీస్తున్నది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తారని తాజా సర్వే అంచనా వేసింది. ఇటీవల నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చింది. ఇటీవల నిర్వహించిన చాలా సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో డెమొక్రటిక్ పార్టీ ఆందోళన చెందుతున్నది. ఓటింగ్‌కు ఏడాది కన్నా తక్కువ సమయమే ఉండటం వీరిని మరింత ఒత్తిడికి గురి చేస్తున్నది. బైడెన్ కన్నా ట్రంప్ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.