ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా ను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నామంటూ ట్రంప్ విలేకరులతో అన్నారు. అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్థుడిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు.
