Namaste NRI

చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌… అప్పటిలోగా ఒప్పందం కుర్చుకోకపోతే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  మరోసారి సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్‌ భారీగా సుంకాలు  చెల్లించాల్సి వస్తుందన్న ట్రంప్‌, తాజాగా చైనాను హెచ్చరించారు. నవంబర్‌ 1వ తేదీ లోగా అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుర్చుకోకపోతే బీజింగ్‌పై సుంకాలు 155 శాతానికి పెంచుతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. చైనాకు అమెరికాపై అపార గౌరవ ఉందని, అందుకే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తున్నదంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. అమెరికా,  ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్‌ డాలర్ల అరుదైన ఖరిజాల ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయిన ట్రంప్‌,  ఈ ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ  చైనా ఇప్పటికే 55 శాతం సుంకాలు చెల్లిస్తున్నది. జిన్‌పింగ్‌ తో న్యాయమైన వాణిజ్య ఒప్పంద కుదరకపోతే ఆ సుంకాలు నవంబర్‌ 1 నుంచి 155 శాతానికి పెరుగుతాయని హెచ్చరించారు. అయితే చైనా పరస్పర రాయితీలు ఇస్తే సుంకాలను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events