అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో జైలు శిక్ష ఉండదని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఆ కేసుకు చెందిన తీర్పును జనవరి పదో తేదీన వెలువరించనున్నారు. ఆ రోజున జరిగే విచారణకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా ట్రంప్ హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డానియేల్స్‌కు డబ్బులు చెల్లించిన ఘటనలో వ్యాపార రికార్డులను తప్పుగా చూపించినట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2006లో స్టార్మీ డేనియల్స్‌ను ట్రంప్ లైంగికంగా వేధించారని, అయితే 2016 ఎన్నికల సమయంలో ఆమెను అడ్డుకునేందుకు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ట్రంప్‌పై విచారణ జరిగింది.
న్యూయార్క్ జ్యూరీ తీసుకున్న నిర్ణయాన్ని జడ్జి మెర్చన్ సమర్థించారు. 18 పేజీల రిపోర్టును ఆయన తయారు చేశారు. రియల్ ఎస్టేట్ టైకూన్ ట్రంప్‌పై ఎటువంటి షరతులు ఉండబోవన్నారు. ఒక దోషిగా ట్రంప్ వైట్‌హౌజ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేదని ఆ రిపోర్టులో చెప్పారు. వాస్తవానికి ఆ కేసులో ట్రంప్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడే ఛాన్సు ఉన్నట్లు అనుమానించారు. కానీ జైలు శిక్ష ఉండదని నిపుణులు భావించారు.