ఈ నెల 11 నుంచి 23 వరకు తెలంగాణ అమెరికా తెలుగు (టీటీఏ) సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో 13 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 11న మాసబ్‌టాంక్‌లోని రెడ్‌క్రాస్ స్కూల్‌లో స్పాన్సర్షిప్, వైద్య శిబిరం, 12న టీహబ్ సాంకేతికతపై అవగాహన సదస్సు, 13న దేవరకొండలో నూతనంగా నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవం, 14న చౌటుప్పల్‌లో గ్రంథాలయం ప్రారంభం, 15న గజ్వేల్‌లో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత, 16న నెక్లెస్ రోడ్డులో 5 కే రన్ ఉంటాయన్నారు. 23న రవీంద్రభారతిలో సేవాడేస్ ముగింపు కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఉంటుందని, ఇందులో లైవ్ మ్యూజికల్ నైట్ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది, కార్యదర్శి కవితా రెడ్డి, సేవాడేస్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్న, ప్రతినిధులు దుర్గాప్రసాద్, ప్రసాద్ కునారాపు, నర్సింహ పెరుక, హెల్త్ అండ్ వెల్నెస్ సలహాదారులు ధూదిపాల జ్యోతిరెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.