ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఇది వట్టి సంప్రదాయం మాత్రమే కాదు చట్టం కూడా. ఆ దేశంలో పుట్టిన ప్రతి పురుషుడూ తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఒకవేళ రెండో పెళ్లికి నో చెబితే కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఏకంగా జీవిత ఖైదు శిక్ష వేస్తారు. ఈ చట్టం కేవలం పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ప్రతి స్త్రీ తన భర్త రెండో పెళ్లిని అంగీకరించాలి. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి. ఆమె ఇందుకు అంగీకరించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆ దేశంలో పుట్టిన పురుషులు, స్త్రీలు రెండు పెళ్లిళ్ల నిబంధనను చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. ఈ రెండు పెళ్లిళ్ల నిబంధన వెనుక బలమైన కారణమే ఉంది. ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీ జనాభా చాలా ఎక్కువ. దీంతో చాలామంది స్త్రీలు పెళ్లికాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తిలోనూ చాలా తేడా వస్తున్నది. ఈ నిష్పత్తిని సమం చేసేందుకు ఎరిత్రియా రెండు పెళ్లిళ్ల నిబంధనను తీసుకొచ్చింది.














