Namaste NRI

యూఏఈ  మరో గోల్డెన్ చాన్స్. .ఇకపై పేరెంట్స్‌కు కూడా

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని  గోల్డెన్ వీసాదారులకు  మరో గోల్డెన్ చాన్స్. ఇప్పుడు వారి పేరెంట్స్కు పదేళ్ల రెసిడెన్సీ కోసం వారు స్పాన్సర్  చేయవచ్చు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో దీన్ని ఒక భాగంగా చేర్చారు. ఈ నేపథ్యంలో అరేబియన్ బిజినెస్ సెంటర్లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్  మాట్లాడుతూ ఒక ప్రవాస ఉద్యోగి సంబంధిత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నిర్ధేశించిన విధంగా ప్రతి పేరెంట్కి గ్యారెంటీగా డిపాజిట్ చెల్లించడం ద్వారా ఒక ఏడాది పాటు తల్లిదండ్రులను   స్పాన్సర్ చేయవచ్చన్నారు. గోల్డెన్ వీసాదారులకు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారని, వారి సంబంధిత కాన్సులేట్లు జారీ చేసిన ప్రామాణిక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని  తెలిపారు.

సాధారణంగా అయితే యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు కనీసం 20వేల దిర్హమ్స్(రూ.4.41లక్షలు) నెలవారీ జీతం పొందినట్లయితే పేరెంట్స్కు స్పాన్సర్ చేయవచ్చని స్పష్టం చేశారు. అయితే, ఈ శాలరీ నిబంధనలు గోల్డెన్ వీసాదారులకు వర్తించవని తెలిపారు. ఇక అర్హులైన నివాసితులకు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు లక్షలాది గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. 10 సంవత్సరాల వీసా ధర 2,800 దిర్హమ్స్(రూ.61,753) నుంచి 3,800 దిర్హమ్స్(రూ.83,808) మధ్య ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events