ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొసాగిస్తున్నారు. సామాన్య పౌరులే లక్ష్యంగా రష్యన్ దళాలు దాడులు చేస్తున్నాయి. పోర్టు నగరమైన మేరియుపోల్‌లో క్షిపణులు, బాంబులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలు వదిలేసి ఉక్రెయిన్ బలగాలు మేరియుపోల్‌ను విడిచి వెళ్లిపోవాలని పుతిన్ సేనల డిమాండ్‌కు ఉక్రెయిన్ ససేమిరా అంది. తమ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఆ దేశ ఉప ప్రధాని ఇరినా వెరెశ్‌చుక్ వెల్లడిరచారు. రష్యాకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. మేరియుపోల్ మేయర్ పీటర్ ఆండ్రీషెన్కో సైతం రష్యా ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. రష్యా విధించిన డెడైలైన్ కంటే ముందే ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతకు ముందు రష్యా బలగాలు మరియుపోల్ నగరంలోని ఆర్ట్ స్కూల్‌పై బాంబు దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన సమయంలో ఆ స్కూల్‌లో 400 మది శరణార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది.














