Skip to main content

Namaste NRI

తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్‌.. రష్యాకు కూడా ఇదే విషయాన్ని

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను కొసాగిస్తున్నారు. సామాన్య పౌరులే లక్ష్యంగా రష్యన్‌ దళాలు దాడులు చేస్తున్నాయి.  పోర్టు నగరమైన మేరియుపోల్‌లో క్షిపణులు, బాంబులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలు వదిలేసి ఉక్రెయిన్‌ బలగాలు మేరియుపోల్‌ను విడిచి వెళ్లిపోవాలని పుతిన్‌ సేనల డిమాండ్‌కు ఉక్రెయిన్‌ ససేమిరా అంది. తమ బలగాలు లొంగిపోయే ప్రసక్తే లేదని ఆ దేశ ఉప ప్రధాని ఇరినా వెరెశ్‌చుక్‌ వెల్లడిరచారు. రష్యాకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. మేరియుపోల్‌ మేయర్‌ పీటర్‌ ఆండ్రీషెన్కో సైతం రష్యా ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. రష్యా విధించిన డెడైలైన్‌ కంటే ముందే ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతకు ముందు రష్యా బలగాలు మరియుపోల్‌ నగరంలోని ఆర్ట్‌ స్కూల్‌పై బాంబు దాడులు చేశాయి. ఈ దాడులు జరిగిన సమయంలో ఆ స్కూల్‌లో 400 మది శరణార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News