లండన్ ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద న్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో లండన్ బీఆర్ఎస్ శాఖ సభ్యుడు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇన్‌చార్జి సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల, ప్రశాంత్ మామిడాల, బోనగిరి నవీన్ పాల్గొన్నారు.

