తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ ఖండాంతరాలు దాటింది. దేశ విదేశా ల్లోని తెలుగు వారు భోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ జరుపుకొన్నారు. శ్రీ శివన్ ఆలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా భక్తీ గీతాలు, ఒగ్గు కళ, డోలు నృత్యం వంటి జానపద సంస్కృతి ప్రదర్శనలతో ఆనందో త్సాహాలతో పండుగ చేసుకున్నారు. ఈ వేడుకలకు బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితాదేవి తుల, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదిరులు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో బోనాలను నియమ నిష్ఠతో సిద్ధం చేయడంతో ప్రారంభమైయ్యాయి. ఈ వేడుకలు సంప్రదాయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలిపాయి. మన పల్లెలో చేసుకొనే బొనాల జాతరను తలపించేలా జరిపినట్లు అంతా కొనియాడారు.
ఈ వేడుకల్లో కార్మిక సోదరులు చురుగ్గా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు అంతా జానపద సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంతో నృత్యాలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచి పెట్టారు. ఒగ్గు కళాకారుడు నక్కా నరేష్ చేసిన ప్రదర్వన అందరి హృదయాలను ఆకట్టుకుంది. ఒగ్డు (డమరు కం)తో నరేష్ 10 నిమిషాల పాటు పాటలు పాడుతూ డప్పుని వాయిస్తూ అమ్మ వారికి బోనం తీసుకువస్తూ చేసిన నృత్యం పిల్లల్ని, పెద్దల్ని కట్టిపడేసింది.పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, వారి ఆహార్యం, మనోహరమైన జానపద నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఎంతో మంది తెలుగు వారు తమ పిల్లలకి ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయాన్ని, బోనాల విశిష్టతను చూపడానికి ప్రత్యేకంగా హాజరైనట్లు తెలిపారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి బోనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలు పండుగ మన తెలుగు వారికి ప్రత్యేకించి తెలంగాణ జానపద సంస్కృతితో ముడిపడి ఉన్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఉచిత బస్సుల్ని ఏర్పా టు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు బోయిని సమ్మయ్య తెలిపారు. సింగపూర్‌లో తెలుగువారి ఐక్యత, సాంస్కృతిక గొప్పతనం అందరికీ ఈ కార్యక్రమం చాటి చెప్పిందని, ఈ జాతర సజావుగా జరిగేందుకు సహక రించిన ప్రతిఒక్కరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో 800 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా, ఆన్‌లైన్ వేదికగా 7 వేల మంది హాజరై వీక్షించినట్లు నిర్వాహకులు వెల్లడిరచారు.