Namaste NRI

అప్పటివరకు భారత్‌తో ఎలాంటి చర్యలు జరిపేదిలేదు

వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌ ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించి తన అక్కసును వెళ్లగక్కారు. భారత ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందిస్తుండటంతో ట్రంప్‌ మరింతగా రెచ్చిపోతున్నారు. సుంకాలపై వివాదం పరిష్కారమయ్యే వరకు భారతదేశంతో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. 50 శాతం టారీఫ్‌ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ఆశించారా అని మీడియా అగిన ప్రశ్నకు లేదు, వివాదం పరిష్కారం అయ్యేవరకు చర్చల ప్రసక్తే లేదంటూ సమాధానమిచ్చారు.

Social Share Spread Message

Latest News