
కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ నెలలోనే విడుదలై అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల హక్కులను ఈఫోర్ సంస్థ దక్కించుకుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఓ కేసు పరిశోధనలో హరిశంకర్ అనే పోలీస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్లు, అతని వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు, వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను అతను ఎలా డీల్ చేశాడనే అంశాలు ట్రైలర్‌లో ఉత్కంఠను పంచాయి. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందించాడు.
