
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ అయ్యారు. మోడీతో సెర్గో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. రక్షణ, వ్యాపారం, సాంకేతికత, ముఖ్యమైన లవణాలు వంటి వాటి గురించి ఇరువురు మంతనాలు జరిపారు. సందర్భంగా తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన ఫొటోను మోడీకి సెర్గో అందజేశారు.అమెరికా రాయబారిని కలవడం పట్ల మోడీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌కు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఆయన హయాంలో భారత్, అమెరికా బంధం బలోపేతం అవుతుందని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతాయని నాకునమ్మకం ఉంది అని మోడీ పేర్కొన్నారు.
















