Namaste NRI

ఆ 12దేశాల ప్రయాణికులపై …అమెరికా నిషేధం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా రు. తాజాగా 12 దేశాలకు చెందిన ప్రయాణికులపై ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు.అఫ్ఘానిస్థాన్‌, మయన్మార్‌, చాద్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సోమాలియా, సూడాన్‌, యెమెన్‌ దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాకు రాకపోకలు సాగించడకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేశారు.

మరో ఏడు దేశాలపై పాక్షికంగా నిషేధం విధించారు. ఈ జాబితాలో బురుండి, క్యూబా, లావోస్‌, సియెర్రా లియోన్‌, టోగో, తుర్క్‌మెనిస్థాన్‌, వెనెజులా ఉన్నాయి. జూన్‌ 9 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు వైట్‌హౌస్‌ వెల్లడించింది.

 ప్రమాదకరమైన విదేశీ వ్యక్తుల నుంచి అమెరికన్లను కాపాడతానంటూ మాట ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ తన మాటను నిలబెట్టుకుంటున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగైల్ జాక్సన్ అన్నారు. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయా దేశాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News