
అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల బ్రిడ్జివాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రే డాలియో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం తీవ్రతకు మించిన ఆర్థిక సంక్షోభం ముప్పు కనిపిస్తున్నదని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణం కొంత వరకు ట్రంప్ దూకుడుగా అమలు చేస్తున్న వాణిజ్య విధానాలేనని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులపై విధిస్తున్న టారిఫ్‌ల ప్రభావం చాలా ముఖ్యమైనదని తెలిపారు. ప్రధాన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక రాజకీయ వ్యవస్థలు చెడిపోవడాన్ని చూస్తున్నామని, ఆర్థిక స్థిరత్వాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో దెబ్బతీసే అత్యంత అరుదైన సంఘటనగా దీనిని పరిగణించవచ్చన్నారు.
