అమెరికా ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెల లో మరోసారి పెరిగింది. అమెరికాలో ప్రజల ఖర్చులు, దీంతో పాటు వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈమేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగత వినియోగ వ్యయాల ధర సూచి ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో అంచనా కంటే 0.4 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 4.4 శాతానికి పె రగ్గా, అంతకుముందు మార్చిలో ఇది 4.2 శాతంగా ఉంది.

2023 జనవరి తర్వాత ద్రవ్యోల్బణం పెరగడం ఇదే మొదటిసారి, సేవలు, ఆహారం, వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం రేటు పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారం, ఇంధనం ద్రవ్యోల్బణం మినహా గత నెలలో ద్రవ్యోల్బణం 4.7 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు బాటపడుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో(జూన్) ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది, ఈ సమయంలో వడ్డీ రేట్ల పెరుగుదలను ప్రకటించే అవకాశముంది.

