Skip to main content

Namaste NRI

భారత్‌ను ప్రశ్నించాలి.. మార్కో రూబియోను కోరిన అమెరికా చట్టసభ సభ్యులు

ఢిల్లీతోపాటు భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో మితిమీరిన బలప్రయోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణల గురించి భారతీయ ప్రతినిధుల వద్ద ప్రస్తావించాలని ప్రమీలా జయపాల్‌, ఇల్హాన్‌ ఒమర్‌లతో సహా ఆరుగురు అమెరికా డెమోక్రటిక్‌ చట్టసభ్యులు తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరారు. అమెరికాలో కాక్రోచ్‌ జనతా పార్టీకి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికన్‌ నగరాల్లోని కాన్సులేట్‌లు ఫొటోగ్రాఫర్లను నియమించాయని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రమీలా జయపాల్‌, ఒమర్‌, జిమ్‌ మెక్‌గవర్న్‌, రషీదా త్లెయిబ్‌, ఎలియనోర్‌ హోమ్స్‌ నార్టన్‌, జీస్‌ గార్సియా ఆరోపించారు. రూబియో వచ్చేవారం భారత్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ను కలవనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events