వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియాకు చెందిన హక్కుల కార్యకర్త జూలియన్ అసాంజేను అపహరించడం లేదా హత్య చేసే అంశాలను చర్చించినట్టు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ అధికారులు తెలిపారు. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలకు పాల్పడితే చట్టపరంగా, అంతర్జాతీయంగా కొత్త చిక్కులు తలెత్తే ప్రమాదమున్న నేపథ్యంలో ఆ ఆలోచనలను విరమించుకున్నట్లు వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)