Namaste NRI

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటన

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సెప్టెంబరులో  భారతదేశంలో పర్యటిస్తారు. ఇండియాలో జరిగే జి 20 సమ్మిట్‌కు హాజరు అవుతారు. బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10 వరకూ భారతదేశంలో పర్యటిస్తారని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రెటరీ కారినే జిన్ పియిరీ ఓ ప్రకటన వెలువరించారు. జి 20 లీడర్స్ సదస్సుకు బైడెన్ హాజరుకానున్నట్లు తెలిపారు. జి 20కి భారతదేశం ఆతిధ్యం ఇస్తోంది. ఈ సమ్మిట్ దశలో బైడెన్ పలువురు నేతలతో ప్రపంచ సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన పరిణామం, వాతావరణ మార్పుల సంక్లిష్టతలపై విశ్లేషిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్పలితాలపై ఈ వేదిక సందర్భంగా సరైన విధంగా నిరసన వ్యక్తం చేసేందుకు బైడెన్ సంకల్పించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షులు అయిన తరువాత బైడెన్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events