అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. భార్య ఉషా వాన్స్, పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. వారు నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో భేటీ కానున్నారు. భారత్ – అమెరికా సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై ఇరువురూ చర్చించనున్నారు.

ఈ పర్యటనలో జేడా వాన్స్ ఫ్యామిలీ రాజస్థాన్ జైపూర్, ఆగ్రాను సందర్శించనున్నారు. 24వ తేదీన తమ పర్యటనను ముగించుకుని వాషింగ్టన్ డీసీకి బయల్దేరి వెళ్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న క్రమంలో ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇక ఉషా వాన్స్ సెకండ్ లేడీ హోదాలో తొలిసారి భారత్‌కు వచ్చారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఉషా వాన్స్ అక్కడే జన్మించారు.
