Namaste NRI

ఉషా పరిణయం మొదలైంది

కె.విజయ్‌భాస్కర్‌ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో క్రాఫ్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఉషా పరిణయం. లవ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ ఉపశీర్షిక. ఈ చిత్రం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష జంటగా నటిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశాలతో రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఈ  చిత్రంలో  వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్‌ చక్రపాణి, రజిత, బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events