పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. బాలీవుడ్ గాయకుడు విశాల్ దద్లానీ, హరిప్రియ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రోతల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి నింపేలా ఈ పాటను తీర్చిదిద్దారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయనాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.















