దిలీప్ ప్రకాశ్, రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఉత్సవం. అర్జున్ సాయి దర్శకత్వం. హార్న్ బిల్ పిక్చర్స్‌పై సురేశ్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్‌బీ శ్రీరాం, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో దిలీప్ ప్రకాశ్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకొని నేలపై కూర్చొని కనిపించారు. ప్రేమ, భావోద్వేగాలు, వినోదంతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ నెల 28న టీజర్ విడుదల చేయను న్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్, సాహిత్యం: వనమాలి, భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, నిర్మాత: సురేశ్ పాటిల్, రచన-దర్శకత్వం: అర్జున్ సాయి.
