
డొనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే ఇద్దరికీ కొన్ని అంశాల్లో స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష అంశంపై వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే వారికి తన అధికారులను ఉపయోగించే కేసుల నుంచి విముక్తి కల్పిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వాన్స్ మాత్రం సహజంగానే వారికి ఎటువంటి క్షమాభిక్ష ఇవ్వకూడదని చెబుతున్నారు. ఈ సందర్బంగా వాన్స్ మాట్లాడుతూ ఇది చాలా సింపుల్. నాడు మీరు శాంతియుతంగా ఆందోళన చేసినట్లైతే, మిమ్మల్ని జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఓ గ్యాంగ్ సభ్యుల్లా ట్రీట్ చేసేది. మీకు క్షమాభిక్ష కూడా లభించేది. కానీ, ఒకవేళ మీరు ఆ రోజు హింసకు పాల్పడితే మీకు క్షమాభిక్ష రాదు. దీనిపై కొంత అస్పష్టత ఉంది. జనవరి 6వ తేదీ నాటి అల్లర్లకు సంబంధించి చాలామంది అమాయకులు విచారణను ఎదుర్కోవడం సరికాదు. దానిని మనం సరిచేయాలి అని వ్యాఖ్యానించారు.
