వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా ముస్తాబైన చిత్రం బవాల్. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని దిలోం కీ డోరియా అనే రొమాంటిక్ గీతానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హల్దీ వేడుకలో పాల్గొనే కాబోయే నవ వధూవరులుగా వరుణ్, జానీ ఇందులో సందడి చేశారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్‌వాలా, అశ్వినీ అయ్యర్ తివారీ నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై నుంచి ఈ సినిమా స్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. డేట్ మెన్సన్ చేయలేదు కానీ జూలైలోనే వస్తుందని వెల్లడించింది.
