Namaste NRI

వరుణ్ సందేశ్ కొత్త సినిమా అప్ డేట్… ఇంట్రెస్టింగ్‌గా నింద  పోస్టర్

వరుణ్‌సందేశ్‌ నటించిన కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ చిత్రం నింద. కాండ్రకోట మిస్టరీ ఉపశీర్షిక. ఆనీ కథానాయిక.   యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిం చారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్‌ ఇతర పాత్రధారులు. కథ, కథనం కూడా ఆయనే. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఓ ఊరి వాతావరణం, అక్కడ అలముకున్న చీకటి.. గుడిసె.. కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. దుర్మార్గులను అంతం చేసేందుకు ఖడ్గంతో సిద్ధంగా ఉన్న న్యాయదేవత విగ్రహం. ఇవన్నీ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాయి. ఏదో కథ చెబుతున్నట్టుగా ఈ పోస్టర్‌ ఉందని పోస్టర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: రమీజ్‌ నవీత్‌, సంగీతం: సంతు ఓంకార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events