Namaste NRI

 వచ్చేసిన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు ఈ చిత్రం   టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్‌ ైస్టెలిష్‌ లుక్స్‌తో కనిపించారు. ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ ఉత్కంఠగా సాగింది. సాంకేతికంగా కూడా ఉన్నతంగా కనిపించింది.  దర్శకుడు మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్య నుంచి కాపాడటానికి అర్జున్‌ అనే వ్యక్తి ముందుకొస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? ఇంతకి అర్జున్‌ చేపట్టిన ఆపరేషన్‌ వెనకున్న లక్ష్యమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది  అన్నారు. వరుణ్‌తేజ్‌ కెరీర్‌లోనే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతాన్నందిస్తున్నారు. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News