Namaste NRI

వరుణ్‌ తేజ్‌ మట్కా షూటింగ్ షురూ

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు.   కరుణకుమార్‌ దర్శకత్వం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయేందర్‌ రెడ్డి తీగల, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.  ఈ  చిత్రంలో నవీన్‌చంద్ర, కిషోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ  చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది. యావత్‌ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 1958-1962 కాలం మధ్యలో కథ నడుస్తుంది. వరుణ్‌తేజ్‌ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 50, 80ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్‌ చేశాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్‌ కుమార్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events