వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి సినిమా రానుంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత లు. ఇది ప్రతిష్టాత్మక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న 58వ సినిమాకావడం విశేషం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబా ద్‌లో మొదలైంది.
ప్యాలెస్‌లో జరుగుతున్న షూటింగ్‌లో మెయిన్ కాస్ట్ పాల్గొంటున్నారు. హీరో, అతని గర్ల్‌ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్, ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో వెంకటేశ్ జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన మేకింగ్ వీడియో వర్కింగ్ ఎట్మాస్పియర్‌ని చూపించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది అని తెలిపారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ నరేశ్, వీటీ గణేశ్, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.