దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్‌డేట్‌ను పంచుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపాడు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

గ్రామీణ నేపథ్యంలోనే మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ నటించనున్నారని, ఇది ఆయనకు వెండితెరపై నటుడిగా మొదటి సినిమా కాబోతోందని సమాచారం. ఇక కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.















